సమిష్టి కృషితో విజయం తథ్యం : టిడిపి

Jan 6,2024 18:06
మాట్లాడుతున్న నారాయణ

మాట్లాడుతున్న నారాయణ
సమిష్టి కృషితో విజయం తథ్యం : టిడిపి
ప్రజాశక్తి- నెల్లూరు సిటీ వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన నాయకులు సమిష్టి కృషితో విజయం సాధించి సత్తా చాటాలని మాజీ మంత్రి, నగర నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పొంగూరు నారాయణ టిడిపి ముఖ్య నేతలకు సూచించారు. నెల్లూరు నారాయణ మెడికల్‌ కాలేజిలోని క్యాంపు కార్యాలయంలో టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు అబ్ధుల్‌ అజీజ్‌, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలతో కలిసి ఆయన శనివారం 28 డివిజన్ల టిడిపి నాయకులు, ప్రెసిడెంట్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ 2024 ఎన్నికల్లో ఎలా పని చేయాలి అనే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మన అభివద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు వైసిపి వైఫల్యాలు, అరాచకాలను తెలియజేయాలని సూచించారు.పొంగూరు నారాయణ మాట్లాడుతూ రానున్న రోజులు ఎంతో కీలకమన్నారు. ప్రతీ ఒక్క టిడిపి నాయకుడు, కార్యకర్తలు, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులందరూ కలిసి కట్టుగా పని చేసి విజయం సాధించాలన్నారు. అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడారు.

➡️