సమ్మె’ఒడిలో ‘అమ్మ’లు

Dec 18,2023 20:48
తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల నిరసన

సమ్మె’ఒడిలో ‘అమ్మ’లుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, చిత్తూరు అర్బన్‌, యంత్రాంగం అంగన్‌వాడీలు సమ్మె ప్రారంభించి ఏడో రోజూ కొనసాగుతోంది.. రోజురోజుకీ పలు పార్టీల, ప్రజాసంఘాల మద్దతు వీరికి లభిస్తోంది. ఏడోరోజు సోమవారం సబ్‌కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలు వేలాదిమంది అంగన్‌వాడీలతో దద్దరిల్లాయి. వేతనం పెంచేంత వరకూ సమ్మె ఆపేది లేదని, ‘అమ్మఒడి’ లేకనే సమ్మె’ఒడి’ చేపట్టామన్నారు. ఓ వైపు వేతనాల పేరిట సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, మరోవైపు నిత్యావసర ధరలు పెరిగి ఇచ్చే వేతనాలు ఓ మూలకు చాలడం లేదని మండిపడ్డారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద పెద్దఎత్తున మహాధర్నా జరిగింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, యూనియన్‌ జిల్లా కార్యదర్శి వాణిశ్రీ, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.జయచంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి డాక్టర్‌ పి.సాయిలక్ష్మి, జిల్లా నాయకులు టి.సుబ్రమణ్యం, లక్ష్మీ, బుజ్జి, వెంకటేష్‌, మురళి, ప్రత్యేక రాయలసీమ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కూరపాటి సురేష్‌ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రోడ్లపై భిక్షాటన చేస్తూ తాము ఎందుకు సమ్మె చేస్తున్నామో అందరికీ వివరించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో విజయకుమారి, నాగభూషణమ్మ, లీల, నాగరాజమ్మ, ప్రియదర్శిని పాల్గొన్నారు.రగూడూరు ఆర్డీవో కార్యాలయం గూడూరు, వెంకటగిరి, కోట ప్రాజెక్టుల నుంచి వెయ్యిమందికి పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు నినాదాలతో దద్దరిల్లింది. ఆర్గీవో కిరణ్‌కుమార్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం నేతృత్వం వహించారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌ సంఘీభావం ప్రకటిస్తూ ప్రాథమిక పాఠశాలలో టీచర్లకు ఎంత వేతనం ఇస్తున్నారో అంత వేతనం అంగన్‌వాడీలకు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు పంటా శ్రీనివాసులురెడ్డి, సిఐటియు నాయకులు జోగి శివకుమార్‌, బివి రమణయ్య, అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు పద్మలీల, రూరల్‌ ఇంద్రావతి, స్వరూపరాణి, మంజుల, సుభాషిణి, విజయమ్మ, కుమారి, ఆసియా, మంగమ్మ, సుబ్బమ్మ పాల్గొన్నారు. ర శ్రీకాళహస్తీ ఆర్డీవో కార్యాలయం వద్ద వెయ్యిమంది పైగా అంగన్‌వాడీలు మెరుపు సమ్మెకు దిగారు. వన్‌టౌన్‌పోలీసులు భారీగా మోహరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య, ఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి వెంకయ్య సంఘీభావం తెలిపారు.అమ్మ పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీల పట్ల జగన్‌ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమన్నారు. ర సూళ్లూరుపేటలో ఆర్డీవో కార్యాలయం ఆవరణలో మహాధర్నా జరిగింది. 600మంది అంగన్‌వాడీలు పాల్గొన్నారు. సిపిఎం నాయకులు జనార్ధన్‌, అంగన్‌వాడీ క్లస్టర్‌ నాయకురాలు మేకల హైమావతి, సిఐటియు నాయకులు రమణయ్య, కె.లక్ష్మయ్య, టిడిపి నాయకురాలు బుద్ధి విజయలక్ష్మి సంఘీభావం ప్రకటించారు. ర బిఎన్‌ కండ్రిగ ఎంపిడిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కళ్లకు గంతలు కట్టుకుని నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. నాయకులు శోభ, కె.సుదర్శన నాయకత్వం వహించారు. ర రేణిగుంటలో మంచినీళ్లగుంట పాత తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన కొనసాగింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 150 మంది శిబిరంలో పాల్గొని నిరసన తెలిపారని ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనమ్మ తెలిపారు. టిడిపి పట్టణాధ్యక్షులు మహబూబ్‌బాష నాయకత్వంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు అన్నదానం చేశారు. సిఐటియు నాయకులు హరినాధ్‌, వెంకటరమణ, సెల్వరాజ్‌ పాల్గొని మద్దతు తెలిపారు. ర పాకాలలో యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి పత్తిపాటి రమేష్‌నాయుడు ఓ ప్రకటనలో సంఘీభావం తెలిపారు. ర వెంకటగిరిలో ఐఎఫ్‌టియు రాష్ట్ర గౌరవాధ్యక్షులు హరికృష్ణ సంఘీభావం ప్రకటించారు.ర నగరిలో యూనియన్‌ నాయకులు ధనకోటి, మునెమ్మ, ఉమ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది. ఎఐటియుసి, సిఐటియు, ఎఫ్‌ఐటియు నాయకులు కోదండయ్య, సురేంద్ర, సురేందర్‌నాథ్‌ సంఘీభావం తెలిపారు. నగరి ఆర్డీవోకు వినతిత్రం సమర్పించారు. పోరాటాల ద్వారానే హక్కులుసాధించుకుద్దాం : నరసింహరావు చిత్తూరుఅర్బన్‌: సమ్మెలో ఉన్న అంగన్వాడీలను బెదిరింపులకు పాల్పడుతూ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించడాన్ని నిరశిస్తూ సోమవారం చిత్తూరు, గుడిపాల, యాదమరి, చిత్తూరు రూరల్‌ ప్రాజెక్టుల అంగన్వాడీలు చిత్తూరు ఆర్‌డిఒ కార్యాలయం ఎదట ధర్నా చేశారు. విన్నూత రీతిలో గ్రామ దేవత అమ్మోరు పూనినట్లుగా వేపాకులతో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. పోరాటాలను అణచివేయడం సాధ్యంకాదని గత అనుభాలు తెలియజేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు అన్నారు. అంగన్వాడీల ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల పోరాట పటిమ ఏపాటిదో తెలిసిందేనన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంగన్వాడీల ఫోరాటానికి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా అంగన్వాడీల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి షకిలా, అంగన్వాడీ అసోషియేషన్‌ నాయకులు ప్రభావతి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సృజని, మమత, బుజ్జి, శశికళ, ఆటో యూనియన్‌ నాయకులు ప్రసాద్‌లతో పాటు వందలాంది మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల నిరసన

➡️