సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల వాహన తనిఖీ

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

మండలంలోని తాటియాకులగూడెం అంతర్‌ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద సోమవారం సాయంత్రం ఎస్‌ఐ వి.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. సరైన వాహన ధృవపత్రాలు లేకుండా వాహనాలు నడిపే వాహన దారులకు జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. అనంతరం సరిహద్దు గుండా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన దారులు మధ్యం తాగి వాహనాలు నడపకూడదని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️