సాగర్‌ జలాలు వృథాగా పోకుండా చర్యలు

ప్రజాశక్తి-కనిగిరి: సాగర్‌ నీటి వృథాను అరికట్టేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ అన్నారు. సోమవారం కనిగిరి పట్టణంలోని 20వ వార్డు పర్యటనలో భాగంగా పట్టణంలోని ఎన్‌ఏపి వాటర్‌ ట్యాంకు వద్ద సాగర్‌ జలాలు వృథాగా పోతున్నాయని, నీటి కుళాయిలు పనిచేయడం లేదని ప్రజలు మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ అక్కడికి చేరుకొని వృథాగా పోతున్న నీటిని పరిశీలించారు. లీకేజులను అరికట్టాలని, మరమ్మతులకు గురైన నీటి కుళాయిలను త్వరితగతిన సరిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజేత కళాశాల అధినేత అరుణోదర్‌, ఎస్‌ఎన్‌ రసూల్‌, వైసిపి నాయకులు చింతగుంట్ల కిషోర్‌బాబు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️