సాగు ఉపయుక్త నమూనాల ప్రదర్శన

నమూనాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి- బుచ్చయ్యపేట

కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నైరా, వ్యవసాయ కళాశాల, కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాల విద్యార్థులు శనివారం మండలంలోని పి.భీమవరంలో రైతు సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సాగకు ఉపయుక్తంగా ఉండే నమూనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడి పీవీకే జగన్నాథరావు, ఏడిఏ రవీంద్రనాథ్‌, డీన్‌ జోగినాయుడు, శాస్త్రవేత్తలు ఎన్‌.రాజకుమార్‌, కిషోర్‌ కుమార్‌, సత్తిబాబు, డాక్టర్‌ సౌజన్య, కళాశాలల విద్యార్థినులు, రైతులు పాల్గొన్నారు.

➡️