సాబ్జీ మృతి ప్రజాఉద్యమాలకు తీరనిలోటు

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికనేత ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతికి సిపిఎం జిల్లా కమిటీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా స్థానిక పవర్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సాబ్జీ సంతాప పార్టీ నాయకులు పి.కిషోర్‌ అధ్యక్షతన జరిగింది. ముందుగా సాబ్జీ చిత్రపటానికి సిపిఎం సీనియర్‌ నాయకులు బి.సోమయ్య, గుడిపాటి నరసింహారావు పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మంగరాజు సాబ్జీ జీవితాన్ని, ఆయన ఉద్యమాల్లో చేసిన కృషిని, ఆయన లేని లోటుని వివరిస్తూ పాట పాడారు. ఈ సందర్భంగా సంతాపసభకు విచ్చేసిన సభ్యులు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ సాబ్జీ ఉద్యమబాటలో నడుస్తూ తన తుదిశ్వాస వదలడం అందరి హృదయాలను కలచివేసిందన్నారు. ఆయన చివరి క్షణాల్లోనూ కైకలూరు, ఆకివీడులో అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటించి వారికి ధైర్యాన్నిచ్చారన్నారు. చివరివరకూ సమాజం కోసం వెచ్చించారని, ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. పోరాటమే ఊపిరిగా పనిచేశారని కొనియాడారు. ఆయన గెలిచింది ఉపాధ్యాయ ఎన్నికల్లో ఎంఎల్‌సిగానే అయినా కేవలం ఉపాధ్యాయ సమస్యలపైనే కాకుండా రైతుల, వ్యవసాయ కార్మికుల, కార్మికుల, చేతివృత్తిదారుల, ఉద్యోగుల సమస్యలపై నిరంతరపోరాటం చేశారన్నారు. శాసనమండలిలో వారిసమస్యలపై ఉద్యమించారన్నారన్నారు. ఆయన మరణంతో ఉభయగోదావరి జిల్లాలో పెద్దదిక్కుని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనమిచ్చే నివాళులని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయరంగాల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేశారన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుడిపాటి నరసింహారావు, బి.సోమయ్య మాట్లాడుతూ అందరి కోసం పని చేసిన మనిషిగా ఆయన జీవితం సాగిందన్నారు. కేవలం కార్మిక, ఉద్యోగ, ఉ పాధ్యాయ రంగాలకే కాకుండా ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రంగా నిర్వహించే అనేక కార్యక్రమాలకు అండగా నిలచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్‌, పి.రామకృష్ణ, మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హైమావతి, ఎ.శ్యామలారాణి, సిపిఎం నాయకులు వి.సాయిబాబు, వి.జగన్నాధరావు, మావూరి శ్రీనివాస్‌, బుస్నాక్‌, కోటేశ్వరరావు, ఎం.సత్యం పాల్గొన్నారు.ప్రముఖుల సంతాపంసాబ్జీ మృతికి కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన సాబ్జీ కుటుంబ సభ్యులకుప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎపి రైతు, కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీలు సంతాపం తెలిపాయి. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మగడ్డ నరసింహ, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ కె.అప్పారావు సంతాపం తెలిపినవారిలో ఉన్నారు.సాబ్జీ అకాల మరణం ప్రజాఉద్యమాలకు తీరనిలోటని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు. సంఘం జిల్లా కమిటీ తరపున ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.ఐఎఫ్‌టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు(యువి) తీవ్ర సంతాపం తెలిపారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన సాధన సమితి నాయకులు దుర్గాప్రసాద్‌, ఠాగూర్‌ సంతాపం తెలిపారు. అలాగే సాబ్జీ మృతికి మానవత అధ్యక్షులు మేతర అజరుబాబు సంతాపం తెలిపారు. సాబ్జీ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెఎసి ఛైర్మన్‌ చోడగిరి శ్రీనివాస్‌, కన్వీనర్‌ నెరుసు వెంకట రామారావు అన్నారు. ఆయన మృతి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. సాబ్జీ మృతి బాధాకరమని విఆర్‌ఒల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు అన్నారు. సాబ్జీ మృతికి ఏలూరు నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ సంతాపం తెలిపారు. ఈ ఘటన బాధాకరమని ఆమె అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.సాబ్జీ మృతికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ సంతాపం తెలిపారు. సాబ్జీ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బి.మనోజ్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షులు గుడిమెల్లి వెంకటేశ్వరావు అన్నారు. ఆయన మృతికి వారు సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌, పార్టీ సీనియర్‌ నాయకులు బి.సోమయ్య సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సాబ్జీ మృతికి హిందూ యువజన సంఘం (వైఎంహెచ్‌ఎ) సభ్యులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వైఎంహెచ్‌ఎ హాలులో సాబ్జీ మృతికి సతాపం తెలిపి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు యర్రా సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెవి.సత్యనారాయణ, కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు, మేనేజ్‌మెంట్‌ కమిటీ ఉపాధ్యక్షులు ఇరదలు ముద్దుకృష్ణ, సహాయ కార్యదర్శి వేమా కోటేశ్వరరావు పాల్గొన్నారు.సాబ్జీ మృతి జీర్ణించుకోలేనిదని ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రంలో జరిగిన సంతాప సభలో వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, నాయకులు ఆలపాటి నాగేశ్వరరావు, అడుసుమిల్లి నిర్మల, ఎన్‌ఎస్‌వి.రామకృష్ణారావు, హైమావతి, గోద్రేజ్‌ ఆగ్రో అడ్వయిజర్‌ కుమార్‌ రిటైర్డ్‌ ఉద్యోగులు వై.ఆనంద నాయుడు, కె.సత్యనారాయణ, హరినారాయణ, ఆంజన ేయులు, కస్తూరి రావు, విజ్ఞాన కేంద్రం వివిధ సంఘాల సభ్యులు రామకృష్ణారావు, మేతర అజరుబాబు, దోమణిక్‌, అర్జున్‌రావు, రత్నాకర్‌రావు, సోమ్లా నాయక్‌, పి.హైమావతి, దుర్గాప్రసాద్‌, రావి పద్మ, ఎ.మోహిని కనకదుర్గ, లక్ష్మి, కోహిమా, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పోలవరం : ఎంఎల్‌సి సాబ్జీ అకాల మృతికి సిపిఎం మండల కమిటీ సంతాపం తెలిపింది. పార్టీ మండల కార్యదర్శి గుడేల్లి వెంకట్రావు మాట్లాడుతూ సాబ్జీ మృతి తీరనిలోటన్నారు. సంతాపం తెలిపిన వారిలో నాయకులు బి.భూచందర్రావు, సముద్రాల సాయి కృష్ణ, మడివి చలపతి, పాప, బాలరాజు, మీడియం గంగాదేవి పాల్గొన్నారు భీమడోలు : ధన్యజీవి సాబ్జీ అని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు అన్నారు. సాబ్జీ మృతికి మండలంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం సంతాప సభలు నిర్వహించారు. గుండుగొలనులో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శాసనసభ్యులు రద్దు చేశారు. ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిడిఒ పద్మావతిదేవి ఆధ్వర్యంలో ఐకెపి, పంచాయతీరాజ్‌ అధికారులు, సిబ్బంది సంతాప సభ నిర్వహించారు. రైతుసంఘం జిల్లా నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావుతో కలిసి సాబ్జీకి నివాళులర్పించారు. మండల వనరుల కేంద్రం వద్ద ఉపాధ్యాయులు, ఎంఇఒ భాస్కర్‌ ఆధ్వర్యంలో సాబ్జీ సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు బాల భాస్కర్‌, పిఆర్‌టియు నాయకులు శరీన్‌ పాల్గొన్నారు. చింతలపూడి : సాబ్జీ సేవలు మరువలేనివని ఎంపిడిఒ మురళీకృష్ణ అన్నారు. ఎంపిడిఒ కార్యాలయం వద్ద చింతలపూడి ప్రెస్‌ క్లబ్‌ అధ్వర్యంలో సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఆజాద్‌, అమిర్‌, రాజు, వీరయ్య, సూరిబాబు పాల్గొన్నారు. ఉంగుటూరు : సాబ్జీ మృతికి యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంబాబు, జోగినాయుడు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో గౌరవ అధ్యక్షులు శీతాల సత్యనారాయణ, హైస్కూల్‌ హెచ్‌ఎం మీరాసాహెబ్‌, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు ఉప్పిలి వెంకటేశ్వరరావు, శ్రీరామకృష్ణ, యుటిఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ద్వారకాతిరుమల : సాబ్జీ మృతికి మండల యుటిఎఫ్‌ నేతలు స్థానిక ఎంఇఒ కార్యాలయం వద్ద సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో నాయకులు కట్టా శ్రీనివాసరావు, గెడ్డం దేవానందరావు, బి.జయరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆగిరిపల్లి: సాబ్జీ మృతి పార్టీకి, ఉపాధ్యాయ సంఘాలకు తీరనిలోటని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రాజు అన్నారు. మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చాకిరి శివనాగరాజు, సభ్యులు సత్తు కోటేశ్వరరావు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.చింతలపూడి : స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంతాప సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రధరరావు, యూటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు పూరేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

➡️