సార్వత్రిక ఎన్నికల్లో కూటమిదే విజయం

Mar 15,2024 20:49

 ప్రజాశక్తి-చీపురుపల్లి : వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూటమిదే విజయమని టిడిపి జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగార్జున మాట్లాడారు. రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో జగన్‌ ను ఇంటికి పంపించి కూటమికి అధికారాన్ని ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ సహకారం అవసరమన్నారు. గ్రూప్‌-1 పరీక్షల్లోనూ జగన్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిండని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్‌ ప్రభుత్వాన్ని ఎంత వేగంగా బంగాళాఖాతంలో కలిపేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని నాగార్జున అన్నారు. ఈ నెల 17 చిలకలూరిపేటలో జరగనున్న తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి సభకు మూడు పార్టీల శ్రేణులంతా భారీసంఖ్యలో తరలి వెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి, జనసేన నాయకులు మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు కష్ట పడిన నాగార్జున కు టికెట్‌ కేటాయించాలని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎస్‌ వి ఎల్‌ ఎన్‌ రాజు, మన్నే పూరి శ్రీనివాస రావు, జనసేన నాయకులు విసినిగిరి శ్రీను, టిడిపి నాయకులు రౌతు కామునాయుడు, పైల బలరాం, దన్నాన రామచంద్రుడు,తాడ్డే సన్యాసి నాయుడు, సారేపాక సురేష్‌, కోట్ల సుగుణాకర రావు, ముల్లు రమణ మహంతి రమణ మూర్తి, బలగం వెంకటరావు, మండల చంటి, కెంగువ ధనుంజయ, మహంతి అప్పలనాయుడుపాల్గొన్నారు.

➡️