సాహిత్యం సమాజ హితం కావాలి

 ఎఎన్‌యు: తెలుగు శాఖలో ముగిసిన జాతీయ సదస్సులి సాహిత్యం పరమావధి అని, అది సమాజ హితం కావాలని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి .రాజశేఖర్‌ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోని తెలుగు ప్రాచ్య భాష విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న ‘సంస్కృతాంధ్ర నవలా సాహిత్యం సామాజిక చైతన్యం’ అనే జాతీయ సదస్సు గురువారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీసీ రాజశేఖర్‌ మాట్లాడుతూ ఏ భాషా సాహిత్యమైన సమసమాజ స్థాపనకు, అభ్యు దయ మార్గానికి దోహదపడినప్పుడే అది చిర స్థాయిగా నిలుస్తుందని అన్నారు. విశిష్ట అతిది రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాదమూర్తి మాటా ్లడుతూ పాచీన వాల్మీకి మహర్షి నుంచి నేటి ఆధునిక కవులందరి సాహిత్యం సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా సాగిందని అన్నారు. సదస్సులో కీలకోపన్యాస కులుగా పాల్గొన్న ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావు మాట్లాడుతూ సాహిత్యం సమాజానికి దర్పణం అని సమా జానికి దూరంగా ఉండే ఏ రచన అయిన నిరుపయోగ మేనని చెప్పారు. నేటి యువత, పరిశోధకులు ఉన్నత విలువలు కలిగిన సాహిత్యాన్ని లోతుగా పరిశీలించి, సామాజిక అంశాలను సమాజానికి అందించాలని సూచించారు. సాహిత్య ప్రక్రియే నవల అని అన్నారు. రచనా వ్యాసాంగం సవ్యంగా, వినూత్నంగా చేయాలని సూచిం చారు. ఆత్మీయఅతిథి, తెలుగు అకాడమీ పూర్వ పు సంచాలకులు ఆచార్య సిహెచ్‌. సుశీలమ్మ, సాహితీ సేవకులు చదలవాడ లక్ష్మి పద్మావతి, విభాగం బి వోఎస్‌ చైర్మన్‌ ఆచార్య ఎన్‌.వి.కృష్ణా రావు ప్రసంగించారు. సదస్సు సంచాలకులు ఆచార్య ఈ.మాధవి సదస్సు నిర్వహించిన ఉద్దే శం, లక్ష్యం నెరవేరినట్లు పేర్కొంటూ 100కు పైగా తెలుగు, సంస్కృత భాషలలో పరిశోధన పత్రాలపై వివరించారు. సదస్సులో డాక్టర్‌ పి. వాసు, బలరామ్‌, లలిత కుమారి, యశ్వంత్‌రెడ్డి, పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

‘కాన్‌ టెంపరరీ స్ట్రాటజేస్‌..’పై సెమినార్‌ ప్రారంభం

ఎఎన్‌యు ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో యూజిసి స్పాన్సర్డ్‌ నేషనల్‌ సెమినార్‌ ‘కాన్‌ టెంపరరీ స్ట్రాటజేస్‌ ఇన్‌ ‘డ్రగ్‌ ప్రొడక్ట్‌ డినైవ్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రారంభమైంది. ముఖ్యఅతిథి విసి ఆచార్య పి. రాజశేఖర్‌ మాట్లా డుతూ అంతరిక్షానికి, దేహానికి, సాంస్కృతిక సారూప్యతకి, గుత్తాధిపత్య భావజాలానికి మధ్య గల సంబంధాన్ని వివ రించారు. డ్రగ్‌ మాలిక్యుల్స్‌ దేహంలోని బయో మాలిక్యుల్స్‌కు రోజు సారుప్యత ఉంటుందని వివరించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎ.ప్రమీలా రాణి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ ఖర్చుతో మందులను తయారు చేయాలని కోరారు. జీవన్‌ బయోటెక్‌ వాదశాబాద్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె. సోమేశ్వర రావు మాట్లాడుతూ నూతన ఔష ధాల పరిశోధనతో ఆర్టి ఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృతిమ మేధస్సు) ప్రాముఖ్యతను వివరించారు. కృతిమ మేధస్సును ఉప యోగించి డిప్రెషన్‌ తగ్గించటానికి ఉప యోగించే ‘బూప్రిపియాన్‌’ అనే మందు స్మోకింగ్‌ హ్యాబిట్‌ ను తగ్గిం చటానికి కూడా ఉపయోగిస్తారని తెలిపారు. ఊటీ లోని జె.యస్‌.యస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ నుంచి డాక్టర్‌ కె.వి.వి. ఎస్‌.నారాయణ రెడ్డి మాట్లాడుతూ రోగులకు, రోగ నిర్ధారణ అనం తరం వారికి సరిపోయే మందు మోతాదును కచ్చి తత్వంతో 3డి ప్రింటింగ్‌ టెక్నాలజీ ద్వారా అందించవచ్చని తెలిపారు. సెమీనార్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గాయత్రి రమ్య మాట్లాడారు. హైదరాబాదులోని నైపర్‌ నుంచి పాల్గొన్న డాక్టర్‌ నీలేష్‌ మెహ్రా ఆఫ్తార్మిక్‌ ప్రోడక్ట్‌ డెవలప్మెంట్‌ ఫ్రమ్‌ బెంచ్‌ టు బెడ్‌ సైడ్‌ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. .

ఎఎన్‌యు రేడియో సేవలు విస్తృతం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని కమ్యూనిటీ రేడియో సేవలను విస్తృతం చేస్తున్నట్లు జర్నలిజం విభాగాధిపతి డాక్టర్‌ జి. అనిత తెలిపారు. రేడియో కార్యకలాపాలను ఎక్కువ మందికి చేరవేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును కేటాయించినట్లు తెలిపారు. దానితో పాటు స్థానికంగా ఉండే సమాచారాన్ని సమాజానికి అందించేందుకు కొత్త ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు, మహి ళలు అన్ని వర్గా లకు సంబంధిం చిన సమాచారం అందించేం దుకు రేడియో ముస్తా బైనట్లు పేర్కొ న్నారు. వర్సిటీ కి ప్రత్యేకంగా కేటాయించిన 91.2 ఎఫ్‌ఎం ద్వారా ఎఎన్‌యు రేడియో సేవలను పొందవచ్చని చెప్పారు. వర్సిటీలోని జర్నలిజం విద్యార్థులతో పాటు అధ్యాపకులు, ఉద్యోగులు, మేధా వులు, పరి శోధకులు, చుట్టు ప్రక్కల గ్రామాల రైతులు ఆయా అంశాలపై వారికున్న సమా చారాన్ని, వారిలోని భావాలను తమ రేడియో ద్వారా సమాజానికి చేరవేయవచ్చని అన్నారు.

➡️