సిఎం జగన్‌ జన్మదిన వేడుకలు

ప్రజాశక్తి -మార్కాపురం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి సారధ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, వైసిపికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిపి మొత్తం 260 మందికి రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం జగన్‌ చేస్తున్న సంక్షేమం, సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు షేక్‌ ఇస్మాయిల్‌, అంజమ్మ శ్రీనివాస్‌, ఎంపిపిలు పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి, సూరెడ్డి రామసుబ్బారెడ్డి, జడ్‌పిటిసి నారు బాపన్‌రెడ్డి, వైసిపి నాయకులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కొమరోలు : ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి కామూరి అమూల్య, కామూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సిఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్డిచెర్ల సర్పంచి ఉమాదేవి,ఎడమకల్లు ఎంపిటిసి కాసా రామలక్ష్మి, రెడ్డిచెర్ల ఎంపిటిసి నిర్మల, బ్రాహ్మణపల్లి సర్పంచి రామనారాయణరెడ్డి, ముక్తాపురం సర్పంచి రమణారెడ్డి, వైస్‌ ఎంపిపి దూదేకుల నాగమ్మ, ఏలూరు రమణయ్య, గర్రే శేషు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వైసిపి యువజన సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు దివాన్‌ బాషా, యువజన సంఘం అధ్యక్షుడు రంగనాయకులు, ఆటో కార్మికులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు. నాగులుప్పలపాడు : ఎంపిపి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపిపి నలమలపు అంజమ్మ కష్ణారెడ్డి దంపతులు, జగనన్న పౌండేషన్‌ అధ్యక్షుడు వారా వీర్రాజు,వైస్‌ ఎంపిపి కె. రాధ, అన్నెం వెంకట్రామి రెడ్డి, పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను వైసిపి నాయకుడు చేరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ కట్‌ చేసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. పేదలకు దుస్తులు అందజేశారు. చేరెడ్డి కార్యాలయం వద్ద అన్నదానం నిర్వహి ంచారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు చేరెడ్డి జయరామిరెడ్డి, ఎంపిపి కడప లక్ష్మి, వైస్‌ ఎంపిపి కడప వంశీధర్‌ రెడ్డి,మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకట సుబ్బయ్య, వైస్‌ చైర్మన్‌ ఆర్‌డి. రామకష్ణ bయర్రం వెంకటరామిరెడ్డి, వేమిరెడ్డి రామచంద్రరెడ్డి, ఇదమకంటి దిలీప్‌ కుమార్‌రెడ్డి, మానం రమణారెడ్డి, మానం వెంకటరెడ్డి, పూసలపాడు బాలిరెడ్డి, అర్ధవీడు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొండపి : కొండపి పంచాయతీలోని కట్టావారిపాలెంలో ముఖ్యమంత్రి జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బొక్కిసం సుబ్బారావు, కొండపి సొసైటీ అధ్యక్షుడు బొక్కిసం ఉపేంద్రచౌదరి, నాయకులు రావెళ్ల రాజీవ్‌ చౌదరి, కట్టా వెంకట రమణయ్య, మామిళ్లపల్లి మాల్యాద్రి, గుమ్మళ్ల శ్రీను, వాలంటీర్‌ బొడ్డపాటి నరసింహం పాల్గొన్నారు. పెద్దదోర్నాల : సిఎం జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలోని రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి చిత్తూరి హారిక, వైసిపి మండల కన్వీనర్‌ గంటా వెంకట రమణారెడ్డి, నాయకులు గుమ్మా యల్లేష్‌ యాదవ్‌, జోగి వెంకట నారాయణ, ఉప సర్పంచి రసూల్‌, జంకె సుబ్బారెడ్డి, చంద్రకాంత్‌ నాయక్‌, భూపాల్‌రెడ్డి, ఖాసింపీరా, గుండారెడ్డి రమణారెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు. పుల్లలచెరువు : ముఖ్యమంత్రి జగన్‌ పుట్టిన రోజు వేడుకలను వైసిపి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి కందుల వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఉడుముల శ్రీనివాసరెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ లాజర్‌, నాయుడుపాలెం సర్పంచి ఆవుల కోటిరెడ్డి, చాపలమడుగు సర్పంచి సత్తిరెడ్డి పాల్గొన్నారు. యర్రగొండపాలెం : ముఖ్యమంత్రి జగన్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌, వైసిపి మండల కన్వీనర్‌ కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, సర్పంచి రామావత్‌ అరుణాబాయి, జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ షాబీర్‌బాషా, వైస్‌ ఎంపిపి ఆదిశేషు, మండల సచివాలయ కన్వీనర్‌ సయ్యద్‌ జబివుల్లా పాల్గొన్నారు. శింగరాయకొండలో భగ్గుమన్న విభేదాలు ప్రజాశక్తి- శింగరాయకొండ : వైసిపి నెలకొన్న విభేదాలు వీడుతాయని అందరూ ఊహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకల్లో వైసిపిలోని విబేధాలు భగ్గుమన్నాయి సిఎం జన్మదిన వేడుకలను కందుకూరు రోడ్‌లో వైసిపి మండల అధ్యక్షుడు సామంతుల రవి కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యన్నాబత్తిన వెంకటేశ్వరరావు, కో ఆప్షన్‌ సభ్యుడు సర్దార్‌, వైసిపి పట్టణ అధ్యక్షుడు పటేల్‌ సలీం బాషా, గొల్లమూడి సుందరామిరెడ్డి,ముళ్ళపూడి సత్య, జెసిఎస్‌ కన్వీనర్‌ తన్నీరు సుబ్బారావు, యనమల మాధవి పాల్గొన్నారు. వైసిపి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బత్తుల అశోక్‌ కుమార్‌ రెడ్డి నివాసం వద్ద సిఎం జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఆర్‌టి నెల్లూరు జోనల్‌ చైర్మన్‌ బత్తుల సుప్రజా రెడ్డి, వైస్‌ ఎంపీపీ షేక్‌ షకీలా, వైసిపి యువజన విభాగం రాష్ట్ర నాయకులు శీలం రాము, మలినేని వెంకటేశ్వర్లు, కట్టా దుర్గారావు, మాజీ సర్పంచి చొక్కా కిరణ్‌ కుమార్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాపూరి ప్రభావతి, శానంపూడి, కనుమళ్ల, కలికివాయి, శింగరాయకొండ మూలగుంటపాడు, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి , సోమరాజు పల్లి, పాత శింగరాయకొండకు చెందిన ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం డాక్టర్‌ బత్తుల శివరామిరెడ్డి ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

➡️