సిఎఎను బలపరిచే పార్టీలను ఓడించాలి

Mar 29,2024 21:55
ఫొటో : కరపత్రాలను అందజేస్తున్న సిపిఎం నాయకులు

ఫొటో : కరపత్రాలను అందజేస్తున్న సిపిఎం నాయకులు
సిఎఎను బలపరిచే పార్టీలను ఓడించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : ఎన్‌ఆర్‌సి, సిఎఎను బలపరిచే బిజెపి ఉమ్మడి అభ్యర్థులను, వైసిపిని రానున్న ఎన్నికల్లో తీవ్రంగా వ్యతిరేకించాలని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మసీదు ఆవరణంలో సిపిఎం మండల కార్యదర్శి ఫర్థీన్‌, కాకు వెంకటయ్య ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సి, సిఎఎల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకు వెంకటయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలు కోసం నిబంధనలు మార్చడం రాజ్యాంగ విరుద్ధమని, దేశ సమైక్యతకు ప్రమాదకరమైన చట్టాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. వీటికి సహకరించిన వైసిపి, బిజెపి, టిడిపి ఉమ్మడి పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. మోడీ ప్రభుత్వం వస్తే జరిగే పరిణామాలకు ప్రతిఒక్కరూ బాధ్యులవుతారనిచ ఓటు వేసే ప్రతిఒక్కరూ ఆలోచించి ఓటు వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, రమణయ్య, తదితర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

➡️