సిద్ధం సభను జయప్రదం చేయండి: బూచేపల్లి

ప్రజాశక్తి-కురిచేడు ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభను జయప్రదం చేయాలని వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం కురిచేడులోని వైసిపి కార్యాలయం వద్ద మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికి మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలను జయప్రదంగా ముగించారని, ఆఖరి సిద్ధం సభ ఉమ్మడి ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి 15 లక్షల మంది ప్రజలు హాజరయ్యే విధంగా ప్రణాళిక రూపొందించారని, అందులో భాగంగానే దర్శి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. కురిచేడు మండలం నుంచి 70 ఆర్‌టిసి బస్సులు, ఇతర వాహనాల ద్వారా పెద్దఎత్తున జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ యన్నాబత్తుల సుబ్బయ్య, మండల సచివాలయ కన్వీనర్‌ మేరువ సుబ్బారెడ్డి, మాజీ ఎంపిపి వీరగంధం కోటయ్య, మేరువ పిచ్చిరెడ్డి, వూట్ల వెంకటేశ్వర్లు, పడమర గంగవరం సర్పంచ్‌ కాసు భాస్కరరెడ్డి, కురిచేడు సర్పంచ్‌ కేశనపల్లి కృష్ణయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️