సిపిఎస్‌ను రద్దు చేయని ప్రభుత్వం

Feb 6,2024 21:47
ఫొటో : పోస్టర్లు ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ఫొటో : పోస్టర్లు ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు
సిపిఎస్‌ను రద్దు చేయని ప్రభుత్వం
ప్రజాశక్తి-అనంతసాగరం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట తప్పను, మడమ తిప్పను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోపు సిపిఎస్‌ను రద్దు చేస్తానని చెప్పారని నేటికీ పరిష్కరించలేదని యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లురెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఎవరైతే ఒపిఎస్‌ అమలు చేస్తారో వారికే మా ఓటు అని ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు ఇవ్వని వారిని కాలర్‌ పట్టుకుని నిలదీస్తే ఈ పరిస్థితి వచ్చేదా.. అని ప్రశ్నించారు. ప్రభుత్వం రావాలని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ రివర్స్‌లో చేయడం దుర్మార్గమైన, హేయమైన చర్యగా వర్ణించారు. సిపిఎస్‌ రద్దు చేసి మాట నిలబెట్టుకుంటారా మీరే తేల్చుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్‌ షేక్‌ గౌస్‌ బాషా, సిపిఎస్‌ నాయకులు నాగరాజు, శ్రీలత, అరుణశ్రీ, సీనియర్‌ నాయకులు శ్రీనివాసులు, మహిళా కార్యదర్శి పి.రాజ్యలక్ష్మి, శైలజ, రిప్కాబాయి, లక్ష్మి, గురుప్రసాద్‌, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

➡️