సిపిఐ నాయకులతో కాంగ్రెస్‌ నేతల భేటి

Mar 30,2024 19:43
సిపిఐ నాయకులతో కాంగ్రెస్‌ నేతల భేటి

నేతల భేటీ దృశ్యం
సిపిఐ నాయకులతో కాంగ్రెస్‌ నేతల భేటి
ప్రజాశక్తి-కందుకూరు :సిపిఐ సీనియర్‌ నాయకులు రావుల వెంకయ్య , కందుకూరు సిపిఐ నాయకులు పోకూరి మాలకొండయ్య, ఇతర కమ్యూనిస్టు నాయకులను కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు నేతి మహేశ్వరరావు కలిశారు. ఇండియా కూటమి తరపున కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రణాళిక మీద చర్చ జరిగింది. కాంగ్రెస్‌, సిపిఐ ,సిపిఎంలతో పాటు అన్ని పౌర సమాజం తో కలిసిన ఇండియా కూటమి ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇవ్వబోతుందన్నారు. మోడీ నిరంకుశ పాలనను తరిమి కొట్టాలని సూచించారు.

➡️