సూపర్‌ సిక్స్‌ పథకాలపై టిడిపి ప్రచారం

Mar 26,2024 22:06

ప్రజాశక్తి – కురుపాం : మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన నీలకంఠపురం గ్రామపంచాయతీ పరిధిలో గల పలు గ్రామాలో టిడిపి అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎన్నికల ప్రచారం మంగళవారం చేపట్టారు. బాబు సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి వివరించారు. కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్‌ కొండయ్య, ఎఎంసి మాజీ చైర్మన్‌ కోలా రంజిత్‌ కుమార్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ సుకేష్‌, నాయకులు వెంపటాపు భారతి, రంజిత్‌ కుమార్‌ నాయకో, శంకర్‌, ప్రదీప్‌, లోవరాజు, పలువురు టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ పెద్దలు, అభిమానులు పాల్గొన్నారు.పార్వతీపురం రూరల్‌ : రాబోయే టిడిపి ప్రభుత్వంలో సూపర్‌ సిక్స్‌ పథకాలతో రాష్ట్రంలోని ప్రజలు ఆర్థికంగా అభివద్ధి చెందనున్నారని పార్వతీపురం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజరు చంద్ర అన్నారు. మండలంలోని పెద్దబొండపల్లిలో మంగళవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులతో కలిసి నిర్వహించారు. టిడిపి-జనసేన, బిజెపి కార్యకర్తలు నాయకులు, ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోలో అంశాలను ప్రజానీకానికి వివరిస్త్షు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి జనసేన, బిజెపి నాయకులు గాంధీ బోను చంద్రమౌళి గురజాన చంద్రమౌళి డొంకాడ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

➡️