సెంటర్‌ పోల్‌ను తొలగించి ప్రమాదం నివారించండి

Feb 9,2024 20:58

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  : పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద 4 రోజుల క్రితం లారీ ఢకొీని ఒరిగిపోయిన సెంటర్‌ లైటింగ్‌ పోల్‌ ను తొలగించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టి, కొత్త ఫోల్‌ను ఏర్పాటు చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, సభ్యులు పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు, సంచాన ఉమా, పడాల రాజశేఖర్‌, ఐద్వా నాయకులు గెద్ద తులసి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్వతీపురం మున్సిపాలిటీలో నాలుగు రోడ్ల కూడలి వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనం ఢకొీని సెంటర్‌ లైటింగ్‌ పోల్‌ పడిపోయి మూడురోజులైనా ఇంతవరకు మున్సిపల్‌ ఇంజనీరింగు అధికారులు తొలగించలేదన్నారు. లైటింగ్‌ లేని కారణంగా రాత్రి వేళలో వాహనదారులకు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. కావున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. తక్షణమే సెంటర్‌ పోల్‌ను తొలగించి కొత్తది ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పల్లి గంగాధర్‌, వారణాశి శంకరరావు, యువత పాల్గొన్నారు.

➡️