సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం

ఆసరా

ప్రజాశక్తి- పెందుర్తి : అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మాటున సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు సైతం అదేస్థాయిలో పెరిగిపోతున్నాయని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఫకీరప్ప అన్నారు. అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్‌ (ఆసరా) ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులు, చట్టాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లును ఆసరా ప్రతినిధులతో కలిసి జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఫకీరప్ప, డిసిపి విఎస్‌.మణికంఠ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫకీరప్ప మాట్లాడుతూ ఆసరా అవగాహన కార్యక్రమాలను అభినందించారు. ఆసరా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఇ.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, తమ అసోసియేషన్‌ సామాజిక బాధ్యతలో భాగంగా వినియోగదారుల హక్కులపై అవగాహనకు అనే కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆసరా సభ్యులు పాల్గొన్నారు

వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఫకీరప్ప, మణకంఠ

➡️