సొంతింటి కల నెరవేర్చింది జగనే

Mar 1,2024 21:00

 ప్రజాశక్తి-కొత్తవలస  : రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి దక్కిందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలో కొత్తవలస -3 సచివాలయ పరిధిలో నిర్వహించిన నవరత్నాలు- – పేదలందరికీ ఇల్లు పట్టాల హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బలిఘట్టంలో 126, ముసిరాం 16, తుమ్మికాపల్లి 10, చినరావుపల్లి 4, కాటకాపల్లి 2, నిమ్మలపాలెం 57 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్ల పట్టాలతో పాటు పట్టా రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ , జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, కొత్తవలస సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.సిఎం సహాయనిధితో ఎంతోమేలుఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధితో ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం వద్ద నియోజవర్గంలో ఏడుగురు లబ్ధిదారులకు సిఎం సహాయనిధి కింద రూ.5.60 లక్షల చెక్కులను ఆయన అందించారు. కార్యక్రమంలో ఫోక్‌ అండ్‌ కల్చరల్‌ డైరెక్టర్‌ వాకాడ రాంబాబు, ఎల్‌.కోట ఎంపిపి గేదెల శ్రీను, కాటకాపల్లి సర్పంచ్‌ కృష్ణ, వైసిపి జామి, వేపాడ, ఎల్‌.కోట మండలాల అధ్యక్షులు గొర్లె రవి, ఎం.జగన్నాథం, జి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️