సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ట్రోలింగ్‌లను తీవ్రంగా పరిగణిస్తాం

జిల్లా ఎస్‌పి మురళీకృష్ణ

ప్రజాశక్తి-అనకాపల్లి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఆన్‌లైన్‌ వేధింపులు, సోషల్‌ మీడియా ట్రోలింగ్‌లు, సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి కెవి మురళీకృష్ణ హెచ్చరించారు. వాట్సాప్‌, టెలిగ్రాం, ఫేస్‌ బుక్‌ గ్రూపుల్లో అడ్మిన్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అభ్యంతకర, తప్పుడు వార్త, వదంతులపై స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. విద్వేషాలు రెచ్చగొట్టేవి, తప్పుడు సమాచారం, తెలియని సమాచారం, వర్గపోరుకు దారి తీసేవి, మార్ఫింగ్‌ ఫోటోలు, తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్‌ 9440904229కు (సమాచార అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది.) సమాచారం అందించాలని కోరారు. అనకాపల్లి జిల్లా పోలీసు వారిని సోషల్‌ మీడియా సామాజిక మాధ్యమాలలో సంప్రదించడానికి ష్ట్ర్‌్‌జూర://్‌షఱ్‌్‌వతీ.షశీఎ/Aఖూూశీశ్రీఱషవ/ష్ట్ర్‌్‌జూర://షషష.టaషవbశీశీస.షశీఎ/aఅaసaజూaశ్రీశ్రీఱసఱర్‌తీఱష్‌జూశీశ్రీఱషవ/ష్ట్ర్‌్‌జూర://షషష.ఱఅర్‌aస్త్రతీaఎ.షశీఎ/aఅaసaజూaశ్రీశ్రీఱసఱర్‌తీఱష్‌జూశీశ్రీఱషవ/ష్ట్ర్‌్‌జూర://షష్ట్రa్‌ఝజూజూ.షశీఎ/షష్ట్రaఅఅవశ్రీ/0029Vaూస1ణQఖీరఅ0ఎఉరబj2V1b పైవాటిని అనుసరించాలని కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అనకాపల్లి జిల్లా పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు.

➡️