‘సౌత్‌ ఇండియా షాపింగ్‌’ మాల్‌ 33వ షోరూమ్‌ ప్రారంభం

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సినీ తారలు అనసూయ, పాయల్‌ రాజ్‌పుత్‌

ప్రజాశక్తి-అమలాపురం

కోనసీమ వాసుల సరికొత్త జీవన శైలిని ఇనుమడింపజేసే విధంగా సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ వారి 33వ షోరూమ్‌ అమలాపురం, హైస్కూల్‌ సెంటర్లో శనివారం శుభారంభం జరిగింది. కుటుంబంలోని అన్ని తరాల అవసరాలకు తగిన వైవిధ్యభరితమైన వస్త్రశ్రేణి, సరసమైన ధరలకు ఒకేచోట లభించడం ఈ షోరూమ్‌ ప్రత్యేకత. రాష్ట్ర మంత్రులు విశ్వరూప్‌, చెల్లుబొయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ తారలు పాయల్‌ రాజ్‌పుత్‌, అనసూయ జ్యోతి ప్రజ్వలనం చేశారు. కుమారి పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ ఈ షోరూమ్‌లో అన్ని వయస్సుల వారినీ అలరించే అద్భుతమైన కలెక్షన్లు ఉన్నాయని ప్రశంసించారు. అనసూయ మాట్లాడుతూ వెరైటీ వస్త్రాలను కొనుగోలు చేయటంలో ముందుండే అమలాపురం, ఆ పరిసరాల షాపింగ్‌ ప్రియుల కోసం సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ వారు అన్ని రకాల వస్త్ర శ్రేణిని సిద్ధం చేశారని, ఇందులోని వెరైటీలు వస్త్రాభిమానుల్ని తప్పకుండా అలరిస్తాయని, అమలాపురం వాసులు ఇక్కడికి విచ్చేయగలరని అన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులను ఉద్దేశించి సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ డైరెక్టర్‌ సురేశ్‌ సీర్ణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులకు, సినీతారలు పాయల్‌ రాజ్‌పుత్‌, అన సూయకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బ్రాండ్‌గా ముద్ర వేసుకున్న సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని ముఖ్యమైన కేంద్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం విస్తరించబోతోందన్నారు.మరో డైరెక్టర్‌ అభినరు అమలాపురం సౌతిండియా షాపింగ్‌ మాల్లోని లభించే ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి, గద్వాల్‌ వంటి వెరైటీలతో కూడిన పట్టు కలెక్షన్ల గురించి వివరించారు. ఈ ప్రారంభోత్సవానికి అమలాపురం ఎంపీ చింతా అనురాధ,కొత్తపేట ఎంఎల్‌ఎ, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, ఎంఎల్‌సిలు ఇళ్ళ వెంకటేశ్వరరావు, తోట త్రిమూర్తులు, కె. సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయేలు, ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌, పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు, అమలాపురం పురపాలక సంఘ అధ్యక్షురాలు రెడ్డి సత్య నాగేంద్రమణి, 13వ వార్డ్‌ కౌన్సిలర్‌, వైసిపి టౌన్‌ ప్రెసిడెంట్‌ వెంకట చంద్రశేఖర్‌,15వ వార్డ్‌ కౌన్సిలర్‌ వాసర్ల లక్ష్మి విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

➡️