స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు

Mar 23,2024 22:33
ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు
స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు
ప్రజాశక్తి-ఉదయగిరి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెంచలయ్య ఆదేశాలతో వింజమూరు, ఉదయగిరి ప్రభుత్వ, ప్రయివేటు స్కానింగ్‌ కేంద్రాలలో చాకలికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కె.మురళీధర్‌ ఆకస్మిక దాడులు నిర్వహించారు. అందులో భాగంగా ఉదయగిరిలో అనురాధ స్కానింగ్‌ సెంటర్‌, వేణు స్కానింగ్‌ సెంటర్‌, శ్రీవిద్య స్కానింగ్‌ సెంటఆర్‌ ప్రభుత్వ వైద్యశాల స్కానింగ్‌ సెంటర్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్‌ కేంద్రాల్లో గర్భిణులకు స్కానింగ్‌ చేసిన తర్వాత లింగ నిర్థారణ చేయడం నేరమని ఆ విధంగా చేసిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిర్వాహకులను హెచ్చరించారు. ప్రతి స్కానింగ్‌ సెంటర్‌లో తెలుగులో లింగ నిర్థారణ చేయడం చట్ట విరుద్ధమని, ఆ విధంగా చేసిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలుగులో బోర్డును ప్రదర్శించాలని, స్కానింగ్‌ చేసే డాక్టర్‌ వివరాలు, స్కానింగ్‌ మిషన్‌ వివరాలు, స్కానింగ్‌ కేంద్రం రిజిష్టరు రెన్యువల్‌ వివరాల సర్టిఫికెట్లు స్కానింగ్‌ తీసే వైద్యాధికారుల విద్యా అర్హతలు స్కానింగ్‌ వివరాల రిజిస్టర్‌ తదితర వివరాలు బోర్డుల రూపంలో ప్రదర్శించాలని ఆదేశించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా స్కానింగ్‌ నిర్వహిస్తే నాటివారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి కలసపాటి.వెంకటసుబ్బయ్య, చాకలికొండ ఆరోగ్య సహాయకులు గురవయ్య పాల్గొన్నారు.

➡️