స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాల తనిఖీ

Mar 15,2024 20:57

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : సాధారణ ఎన్నికలకు ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌, ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ శుక్రవారం తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాల్లో కల్పించాల్సిన మౌళిక సదూపాయాలు, తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు గురించి సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. నిరంతరం సిసి కెమెరాల పర్యవేక్షణ, విద్యుత్‌ సరఫరా ఉండాలని స్పష్టం చేశారు. బారికేడ్లు ఏర్పాటు, రాత్రి వేళల్లో వెలుగు ఉండేలా విద్యుత్‌ సదుపాయం, రక్షిత విద్యుత్‌ వైరింగు చేయాలని సూచనలు చేశారు. వాహనాలు పార్కింగు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా రిసెప్షను సెంటర్లు, మీడియా సెంటరు ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, ఆర్‌డిఒలు కె.హేమలత, ఎ.వి.రమణ, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి డాక్టర్‌ ఎంవిఆర్‌ కృష్ణాజీ, డ్వామా పిడి కె.రామచంద్రరావు, రోడ్లు భవనాలశాఖ ఇంజినీరింగ్‌ అధికారి ఎస్‌.వేణుగోపాలరావు, డిఇ అప్పాజీ, ఇన్‌ఛార్జ్‌ ప్రిన్సిపల్‌ ఆర్‌.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️