‘స్పందన’లో 80 ఫిర్యాదులు

Jan 29,2024 21:46
ఫిర్యాదులు స్వీకరిస్తున్న దృశ్యం

ఫిర్యాదులు స్వీకరిస్తున్న దృశ్యం
‘స్పందన’లో 80 ఫిర్యాదులు
ప్రజాశక్తి-నెల్లూరుఎస్‌పి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బాధితుల నుంచి 80 ఫిర్యాదులు స్వీకరించామని అడిషినల్‌ ఎస్‌పి సౌజన్య తెలిపారు. స్పందన కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ యస్‌.పి. డా.కె. తిరుమలేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ”స్పందన” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలను మభ్యపెట్టి వారి వ్యక్తిగత సమాచారాన్ని సోషల్‌ మీడియాలో అప్లోడ్‌ చేస్తానని బెదిరింపులకు గురిచేస్తూ బ్లాక్‌ మెయిల్‌ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేశారు. హత్య, అనుమానాస్పద, మిస్సింగ్‌ వంటి తీవ్రమైన కేసులలో దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను చేధించి, బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు. స్పందనలో భూ, ఆస్థి వివాదాలు, ఉద్యోగాలు, వద్ద తల్లిదండ్రులు వేధింపులు, సోషల్‌ మీడియా ద్వారా బ్లాక్‌ మెయిల్‌, మహిళా సమస్యలు, కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, నమోదైన కేసులలో పురోగతి, ఇతర వివాదాలు సమస్యల ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు హాజరైయ్యారు.

➡️