స్పందన’ ఫిర్యాదులకు పరిష్కారం

Dec 13,2023 19:15
పరిశీలిస్తున్న కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌'

పరిశీలిస్తున్న కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌’
స్పందన’ ఫిర్యాదులకు పరిష్కారం
ప్రజాశక్తి – నెల్లూరు సిటీ నగర పాలక సంస్థ పరిధిలోని సమస్యల పరిష్కారానికి నిర్వహించే స్పందన వేదికలో అందుకున్న కొన్ని ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు అధికారులతో కలిసి కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ బుధవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ముత్తుకూరు రోడ్డు కూడలిలోని రామలింగాపురం పరిసర ప్రాంతాల్లోని రోడ్డు ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. డివిజన్‌ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను వేగవంతం చేసి వరద ప్రభావ ప్రాంతాల్లో బ్లీచింగ్‌, దోమల నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. నగర పాలక సంస్థ ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, ఆరోగ్య శాఖ, ఫిర్యాదు దారులు పాల్గొన్నారు.

➡️