స్వామి వివేకానంద జయంతి

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం సమీపంలోని దేవరాజుగట్టు వద్దగల ‘కిట్స్‌’ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్వామి వివేకానంద 161వ జయంతి శుక్రవారం నిర్వహించారు. వివేకానంద జయంతి సందర్భంగా యూత్‌ డే నిర్వహించారు. తొలుత వివేకానందుడి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ అన్నా కష్ణచైతన్య, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వెన్నా కృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రపంచానికి, భారతదేశ ఆధ్యాత్మిక విలువలు నేర్పిన వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ పి.అనిల్‌ కుమార్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.రంగనాయకులు, కళాశాల ఎఒ ప్రభాకర్‌, వివిధ విభాగపు అధిపతులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌, పి.రామ్మోహన్‌, రాముడు, కిషోర్‌బాబు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శింగరాయకొండ : శింగరాయకొండలోని మదర్‌ ల్యాండ్‌ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మదర్‌ ల్యాండ్‌ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్‌ శుభ కిరణ్‌, ఎం.వెంకట్రావు, కె.నాగమణి, జి.హైమావతి, సుభాషిణి, వి.సునీత పాల్గొన్నారు.

➡️