హక్కులను కాలరాస్తున్నారు : టిడిపి

Nov 30,2023 21:11

 ప్రజాశక్తి-గరివిడి   :   వైసిపి పాలనలో ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని టిడిపి విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. చంద్రబాబు పరిపాలిస్తే సమాజం అంతా బాగుంటుందని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. గురువారం స్థానిక సినిమా హాల్‌ సెంటర్‌లో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ ‘ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి టిడిపి మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ గతంలో చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకూ మేలు జరిగిందని, సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లడంపైనే విజన్‌ ఉండేదని గుర్తు చేశారు. వివిధ కార్పోరేషన్లు పెట్టి నిధులు విడుదల చేసి వారి అభ్యున్నతికి తోడ్పడే వారని గుర్తు చేశారు. ప్రస్తుత జగన్‌ పాలన అంతా విధ్వంసమే అని విమర్శించారు. అధికారం ఇచ్చిన తర్వాత ఆయన మైండ్‌ సెట్‌ ఎలాంటిదో ఈ నాలుగున్నరేళ్లలో అంతా చూశారని తెలిపారు. వ్యవస్థన్నా.. అందులో ఉండే మనుషులన్నా గౌరవం లేదన్నారు. ప్రజాస్వామ్యంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు. వివిధ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని, నిధులను దారి మళ్లించారని తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు రావాలని అన్నారు. కార్యక్రమంలో సారేపాక సురేష్‌ బాబు, రెడ్డి గోవింద, యజ్జిపరపు సత్యం, కుమిలి శ్రీను,తూట శ్రీను, గొట్టిముక్కల సత్తిరాజు,వైగాల సత్యం, దుక్క రామకష్ణ, బాబీ,బొడ్డేపల్లి ప్రసన్న కుమార్‌,పద్మ, పాపి నాయుడు, సూరప్పడు, అప్పలనాయుడు పాల్గొన్నారు.

➡️