హమాలీల వేతన ఒప్పందం చేయాలి

Feb 28,2024 21:20

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఏపి బెవరేజెస్‌ హమాలీలకు వేతన ఒప్పందం చేయాలని సిఐటియు నాయకులు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. బుధ వారం హమాలీలకు వేతన ఒప్పందం చేయాలని కోరుతూ స్థానిక ఐఎంఎల్‌ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి శంకర రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ బెవరిజెస్‌ హమాలీ కార్మికుల ఎగుమతి, దిగుమతి, పీస్‌ రెట్లు ఒప్పందం పూర్తి అయి 3నెలలు దాటిందని, ఇంతవరకు కొత్త కాంట్రాక్టర్‌తో కొత్త వేతన ఒప్పందం చేయాలేదని తెలిపారు. ఇప్పటికే వేతన ఒప్పందం చేయాలని రాష్ట్ర ఎండికి డిమాండు నోటీస్‌ ఇచ్చినట్లు తెలిపారు. దీనిలో భాగంగా అన్ని డిపోల ఎదుట నిరసన ధర్నాలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా కొత్తగా పీస్‌ రెట్లు ఒప్పందం చేయాలని, ఇన్స్యూరెన్స్‌ అమలు చేసి, పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిగి రాక పోతే కచ్చితంగా సమ్మే చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీను, డిపో కార్యదర్శి కార్తిక్‌లు పాల్గొన్నారు.

➡️