హామీలు అమలు చేయాలని పోస్ట్‌కార్డు

Dec 19,2023 21:49 #Anganwadi strike
ఫొటో : పోస్ట్‌కార్డులను చూపుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

ఫొటో : పోస్ట్‌కార్డులను చూపుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
హామీలు అమలు చేయాలని పోస్ట్‌కార్డు
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజు మంగళవారం కొనసాగింది. అంగనవాడి టీచర్లు, హెల్పర్లకు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పోస్ట్‌కార్డు ద్వారా అంగన్‌వాడీ టీచర్లు హెల్పర్లు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సెంటర్లకు వేసిన తాళాలు పగలగొట్టడం చాలా దుర్మార్గమైన విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసి ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమ్మెకు మహాజన సోషలిస్ట్‌ పార్టీ మద్దతు తెలియజేసింది. కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య, వ్యకాసం నాయకులు టి.మాల్యాద్రి, సిఐటియు నాయకులు వై.కృష్ణమోహన్‌, తుమ్మల వెంకయ్య, నరహరి, బి కృష్ణయ్య, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు రఘురావమ్మ, సుభాషిణి, కళావతి, వజ్రమ్మ, శాంతి కుమారి, తదితరులు పాల్గొన్నారు.

➡️