హామీలు అమలు చేయాలి

ప్రజావక్తి -వెల్లిగండ్ల : ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హనీఫ్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమ్మెలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ సమ్మె కొనసాగించాలన్నారు. ఇచ్చిన మాట అమలు జరిగేంత వరకు పోరాటం కొనసాగాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు 39 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రాయల మాలకొండయ్య, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు రఫియా తదితరులు పాల్గొన్నారు. కనిగిరి : సమ్మెలో భాగంగా ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తొలుత అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిసికేశవరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా చట్టం ప్రయోగించడం, నోటీసులు జారీ చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. నోటీసులు జారీ చేసిన, ఎస్మా చట్టం ప్రయోగించిన పోరాటాన్ని ఆపలేరని తెలిపారు. ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నాయకుడు ఎస్‌డి. ఫిరావలి, జి.వెంకటేశ్వర్లు సమ్మెకు మద్దతు తెలిపారు. రూ.2వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌. సుజాత, రాజేశ్వరి, సీత, మనోరంజిత, రామ సుబ్బులు, డివైఎఫ్‌ఐ నాయకుడు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.ఒంగోలు : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. సమ్మె శిబిరానికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ అధ్యక్షత వహించారు. దీక్షలను ఆర్‌టిసి విశ్రాంత ఉద్యోగి నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీల సమ్మె పై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ వారి భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు కెవిపిఎస్‌ మద్దతు తెలుపుతుందన్నారు. అంగన్‌వాడీల వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రభుత్వం అర్ధరాత్రి సమయంలో అంగన్‌వాడీలకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. పొదిలి : అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని ఎత్తివేయకుంటే జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌ తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మా విధించి షోకాజ్‌ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పడం దుర్మార్గమని తెలిపారు. మాట తప్పను – మడమ తిప్పననే ముఖ్యమంత్రి అంగన్‌వాడీలకు ఇచ్చిన మాట తప్పడం సిగ్గుచేటన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలన్నారు. సచివాలయ ఉద్యోగులతో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిం చాలనుకునే ప్రభుత్వ ప్రయత్నం విఫలమయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పొదిలి ప్రాజెక్టు అధ్యక్షురాలు యం.శోభారాణి నాయకులు యస్‌.శారధ, లక్ష్మీదేవి, వెంకటమ్మ, షమీమ్‌, యల్లమ్మ పాల్గొన్నారు. దర్శి : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు తాండవ రంగారావు మాట్లాడుతూ అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు బాలమ్మ, తిరుపతమ్మ, నాగమణి, దేవిబాయి, సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, నారాయణ,అంజిబాబు, అంగన్‌వాడీలు సుజాత, మానిక్యం, లక్ష్మీదేవి, విజయ, మల్లేశ్వరి, చైతన్యభారతి, ప్రశాంతి పాల్గొన్నారు. మద్దిపాడు : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రారంభించి అందరికీ సామాజిక న్యాయాన్ని చేస్తా నంటుందని, అంగన్‌వాడీలు 39 రోజులుగా సమ్మె చేస్తున్న వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించ కుండా ఏ ప్రజలకు సామాజిక న్యాయాన్ని ప్రభుత్వం అందిస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చినంతమాత్రాన ప్రజలందరికీ సామాజిక న్యాయం జరగదని తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెకు విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్ర మంలో సిఐటియు నాయకురాలు ఉబ్బా ఆదిలక్ష్మి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శుల్ణు జయప్రద ,ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెద్ద దోర్నాల : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో అంగన్‌వాడీ నాయకులు షేక్‌ ముంతాజ్‌, సుబ్బమ్మ, వెంకటలక్ష్మి, భారతి, ధనలక్ష్మి, మేరికుమారి, కాశీశ్వరి తదితరులు పాల్గొన్నారు. కొండపి : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని సిఐటియు మండల నాయకులు జి.వందనం, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా అంబేద్కర్‌ బొమ్మ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని లక్షలాది మంది అంగన్‌వాడీలు రోడ్లపైకొచ్చి దీక్షలు చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదన్నారు. ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు. నాగులుప్పలపాడు : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టితే ఎస్మా చట్టాని ప్రయోగిస్తామని, షోకాజ్‌ నోటీసులు అందజేసి బెదిరింపులకు గురి చేయడం దుర్మార్గమని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా సహయకార్యదర్శి టి. శ్రీకాంత్‌ ,సిఐటియ నాయకులు జి.బసవపున్నయ్య, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు వెంకట సుబ్బమ్మ, దుర్గాభవాని,రజని, అరుణ,రమ తదితరులు పాల్గొన్నారు.యర్రగొండపాలెం : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు అంబ్కేర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశాడు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డికెఎం.రఫీ, ఏరియా కో ఆర్డినేటర్‌ షేక్‌ అమీన్‌బాషా, అంగన్‌వాడీ నాయకులు మల్లేశ్వరి, పి.సుభాషిణి, నాగ మల్లేశ్వరి, అరుణ కుమారి, సుజాత, రోజా, సుబ్బలు, సునీత, అరుణ, జయమ్మ, నాగరాజకుమారి, సుబ్బులు పాల్గొన్నారు.

➡️