హామీల అమలు కోసం రాజీలేని పోరాటం : సిఐటియు

ప్రజాక్తి – కనిగిరి : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి పిసి. కేశవరావు తెలిపారు. స్థానికకార్యాలయంలో సిఐటియు జిల్లా వైజ్ఞానిక శిక్షణా తరగతులకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16,17 తేదీల్లో కనిగిరిలో సిఐటియు జిల్లా వైజ్ఞానిక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ, కార్మిక, ప్రజా పక్షాన నిలిచి పోరాటం చేసే సిఐటియు శిక్షణా తరగతులను జయప్రదం చేసే విధంగా ప్రజలు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరేంద్ర వెంకటేశ్వర్లు, వాసు, ఆమోస్‌, లక్ష్మయ్య, గరటయ్య, ఎలిశారు పాల్గొన్నారు.

➡️