హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఆపకుంటే ఉద్యమం

హైడ్రో పవర్‌ ప్రాజెక్టు

ప్రజాశక్తి- దేవరాపల్లి : మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు బలిపురం సమీపంలో అదాని కంపెనీ నిర్మిస్తున్న హైడ్రో పవర్‌ప్లాంట్‌ పనులు వెంటనే నిలుపుదల చేయాలని మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి పి.వి.జి.కుమార్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం బలిపురం సమీపంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. రైవాడ రైతులకు, రైవాడ జలాశయానికి ఇంత అన్యాయం జరుగుతున్నా, స్థానిక మంత్రి ి కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం వలన గిరిజన, ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పమన్నారు. స్థానిక ప్రజలకు ముఖ్యంగా గిరిజనులకు, రైతులకు తీవ్రనష్టం కలిగించే ప్రాజెక్టుకు రాష్ట్రకేబినెట్‌ ఆమోదించినప్పుడు, తర్వాత ఇపుడైనా ఉపముఖ్యమంత్రి నోరు మెదపకపోవడంపై మండిపడ్డారు. తక్షణమే పనులు నిలుపుదల చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో కర్రి సింహాద్రి నాయుడు, బండారు రామారావు, దోగ్గ దేముడు నాయుడు, చల్లా నానాజీ, జూరెడ్డి రాము, గొర్లి దేముళ్ళు, ముక్తు ఈశ్వరరావు, తేడా చిన్నా పాల్గొన్నారు.

ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న టిడిపి నేతలు

➡️