హైరిస్క్‌ గర్భిణులను గుర్తించండి

Mar 21,2024 20:40

ప్రజాశక్తి-విజయనగరం కోట :  హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి వారికి అత్యవసర సేవలు అందించాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు సిబ్బందికి సూచించారు. మాతృ, శిశు మరణాలపై గురువారం వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్‌ 23 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 24వరకు జిల్లాలో 3 మాతృ మరణాలు, 6/37 శిశు మరణాలపై సమీక్షించారు. హైరిస్క్‌ గర్భిణి కేసులు గుర్తించి వారి సేవలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్‌ గౌరీ శంకర్‌, జిఎంసిహెచ్‌ఒడి ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరుణ శుభ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.సుజాత దేవి, డాక్టర్‌ సత్యనారాయణ, సిడిపిఒ జి.ప్రసన్న, డాక్టర్‌ జి.శశిభూషణరావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సత్యనారాయణ పిహెచ్‌సిల వైద్యాధికారులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️