10న జానపదాలు-జ్ఞానపదాలు గ్రంథావిష్కరణ

ప్రజాశక్తి-అద్దంకి: విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి రచించిన ‘జానపదాలు-జ్ఞానపదాలు’ గ్రంథావిస్కరణ సభ అద్దంకిలో వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణ మండపం, గీతా మందిరంలో శనివారం ఉదయం 10 గంటలకు పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా మెయిన్‌ రోడ్‌లోని ప్రియదర్శిని ఫర్నిచర్‌లో కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమా నికి రిటైర్డ్‌ ఆర్‌జేడి యు దేవపాలన, ప్రముఖ సాహితీ విశ్లేషకులు అన్నంనేని వెంకటరావు, మాజీ సర్పంచ్‌ చెన్నుపల్లి వెంకటేశ్వర్లు, చెన్నుపాటి రామాంజనేయులు, వారణాసి రఘురామశర్మ, భారతీయ జానపద కళాక్షేత్రం అధ్యక్షుడు చెన్నుపల్లి నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️