మడికిలో నూరుశాతం పింఛన్ల అందజేత

Jul 2,2024 10:48 #100, #Konaseema, #Madiki, #pensions

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : సర్వర్లు మొరాయిస్తున్నప్పటికీ పింఛన్లు అందజేయాలన్న దఅఢ సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగులు టీములుగా ఏర్పడి వేగవంతంగా పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మండలంలోని మడికిలో సచివాలయ ఉద్యోగులు, నాయకుల అండదండలతో మంగళవారం ఉదయానికి నూరు శాతం పింఛన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి గ్రామ అధ్యక్షుడు దొండపాటి సుబ్బరాజు, టీడీపీ సీనియర్‌ నాయకుడు ఈదల రమేష్‌, జనసేన సీనియర్‌ నేత కొత్తపల్లి నగేష్‌ నాయుడు మాట్లాడుతూ …. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి ప్రయత్నంలోనే ఒకేరోజులో నూరుశాతం పింఛన్లు పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగాన్ని వారు అభినందించారు. ఇంటింటికీ పింఛను పంపిణీలో నేరుగా పాల్గన్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలను కొనియాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అభినందించారని వారు తెలిపారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేయగలరనేది పింఛన్ల పంపిణీతో మరోసారి రుజువు అయ్యిందని వారు అభిప్రాయపడ్డారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నేతలు పాలూరి సత్తిబాబు, చెల్లబోయిన సింహాచలం, అడ్డాల వీర వెంకట సత్యనారాయణ రాజు, మామిడిశెట్టి వెంకట రమణారావు, పెనుమాక సూరిబాబు, చెల్లబోయిన శ్రీనువాసు, పెనుమాక నరేశ్‌, కొత్తపల్లి కఅష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️