వంద టిడిపి కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: దోర్నాల పట్టణంలో ఆదివారం టిడిపిని వీడి వివిధ గ్రామాలకు చెందిన వంద కుటుంబాల వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి బూదాల అజితారావు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంధర్భంగా అజితారావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి, వైసీపీలు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరచిన తొమ్మిది గ్యారంటిల గురించి తెలిపారు. మహిళా మహాశక్తి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ. రెండు లక్షలు వరకు రైతు రుణమాఫీ, రైతు పెట్టుబడి మీద 50 శాతం లాభంలో మద్దతు ధర, మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా రూ. 30 లక్షలు, రాష్ట్రం ద్వారా 2.25 లక్షల ఉద్యోగాలు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తుందన్నారు. ఉపాధి హామీకి కనీసం రూ. 400 వేతనం, ఇళ్లు లేని వారికి రూ.5 లక్షలతో ఇళ్లు, వృద్ధులకు, వితంతువులకరూ. 4 వేలు, విభిన్న ప్రతిభావంతులకు రూ.6 వేలు చొప్పున కాంగ్రెస్‌ పార్టీ అందజేస్తుందన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జబ్బార్‌, జనిగొర్ల వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, అల్లూరయ్య, లింగయ్య, చెంచయ్య, ప్రభుదాసు, అచ్చిరెడ్డి, వెంకటరెడ్డి, రాజయ్య, ఇజ్రాయేలు తదితరులు ఉన్నారు.

➡️