బాబుజగజ్జీవన్‌ రావు 116వ జయంతి – మజ్జిగ పంపిణీ

ప్రజాశక్తి-పిఠాపురం (కాకినాడ) : పట్టణంలోని స్థానిక ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్‌ వద్ద బాబు జగజ్జీవన్‌ రావు 116వ జయంతి సందర్భంగా … రిక్షా కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. తొలుత సంఘం అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, నూకరాజులు మాట్లాడుతూ …. జగజ్జీవన్‌రావు ఉప ప్రధానిగా భారతదేశానికి, ప్రజలకు చేసిన సేవలు మరువలేనివన్నారు. అట్టడుగువర్గాల ప్రజల భవిష్యత్తు బాగుండాలని పోరాటం చేస్తున్నామన్నారు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్‌ పి.నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు కుంచె చిన్న.కరణం విశ్వనాధం, కోనేటి రాజు, రాజబాబు, రాజబ్బాయి, సత్తిబాబు, సోమరాజు, నాగేశ్వరరావు, వై.సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️