126మందికి కళ్లద్దాల పంపిణీ

ఎమ్మెల్యే వెలగపూడి

ప్రజాశక్తి – ఆరిలోవ : గీతం ఆసుపత్రి, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 12వ వార్డు ఆరిలోవ టిఐసి పాయింట్‌ వద్ద నిర్వహించిన కంటివైద్యశిబిరంలో దృష్టిలోపమున్నట్లు గుర్తించిన వారికి శుక్రవారం కళ్లద్దాలను పంపిణీ చేశారు. శుక్రవారం తోటగరువు టిడిపి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఒమ్మి సన్యాసిరావు 126 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసారు.కార్యక్రమంలో టిడిపి నాయకులు ఒమ్మి అప్పలరాజు, బుడుమూరు గోంందు, గాడి సత్యం, ఏడువాక సన్యాసిరావు, ఒమ్మి పోలారావు, కొత్తల గోపాల్‌, దువ్వి తాతారావు, బాలరాజు, బసవ దేవుళ్ళు పాల్గొన్నారు.

కళ్ళద్దాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి

➡️