14వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

14వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె జిల్లాలో సోమవారం 14 రోజు చేరుకుంది. వారి సమ్మెకు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ప్రజాశక్తి-యంత్రాంగంఅమలాపురం ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలోనే క్రిస్మస్‌ కేట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పి.అమూల్య, విజయ, రత్నకుమారి, మణిమాల, దైవకృప, బేబీ గంగారత్నం పాల్గొన్నారు. మండపేట స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మిక నాయకులు బంగారు కొండ, కొమరపు నరేంద్ర కుమార్‌, మండపేట ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.బేబీ, ఆదిలక్ష్మి, సిహెచ్‌.రాణి, మంగాదేవి, జానకి, అనంత, దేవకి, దుర్గా, వజ్రం, కుమారి, నాగలక్ష్మి, కమల, సత్యవేణి, పద్మ, నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.రామచంద్రపురం అంగన్‌వాడీల సమ్మెలో పలువురు వర్కర్లు విప్లవ గీతాలను ఆలపిస్తూ నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు దుర్గ, వరలక్ష్మి, కె.గంగవరం, రామచంద్రాపురం మండలాలకు చెందిన సుమారు 400 మంది శిబిరంలో పాల్గొన్నారు.ముమ్మిడివరం అంగన్‌ వాడి వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమంటే ఆంక్షలతో నిర్బంధించడం అన్యాయం అని సిఐటీయు జిల్లా కార్యదర్శి జి.దుర్గా ప్రసాద్‌ విమర్శించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయ ఆవరణలో ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ వర్కర్లు క్రిస్మస్‌ పండగ సందర్భంగా శిబిరంలోనే కేక్‌ కట్‌ చేసి ప్రార్థనలు చేశారు. అంగన్‌వాడీ అక్కా చెల్లెమ్మల బాధలను సిఎం జగన్‌ అర్థం చేసుకునే మనసును ప్రసాదించాలని వేడుకున్నారు. ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు జయలక్ష్మి, కెవివి.సుబ్బలక్ష్మి, వి.యశోదా దేవి, ఎం.విజయలక్ష్మి, వి.సత్యవతి, ఎస్‌.కనక దుర్గ, బి.నాగరత్నం, అనంత రమాదేవి, మల్లీశ్వరి, విజయ కుమారి, జి.మంగాయమ్మ పాల్గొన్నారు.మామిడికుదురు తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది.

➡️