16న గీతం పూర్వ విద్యార్థుల సమ్మేళనం

గీతం పూర్వ విద్యార్థుల సమ్మేళనం

హోమ్‌ కమింగ్‌ పేరుతో సైకిల్‌ ర్యాలీ, ప్రచారం

ప్రజాశక్తి- మధురవాడ: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని ఈనెల 16న ‘హోం కమింగ్‌’ పేరిట నిర్వహించనున్నట్లు గీతం పూర్వ విద్యార్ధుల సంఘం డిప్యూటీ డైరక్టర్‌ పి.నవీన్‌ తెలిపారు. సోమవారం గీతం ప్రాంగణం నుంచి ఆర్‌కె.బీచ్‌ వరకు పలువురు పూర్వ విద్యార్థులతో కలిసి సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ఏడాది పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో ప్రముఖ సంస్థలలో ప్రతిభను చాటుతూ కీలకస్థానాలకు ఎదిగిన పలువురు గీతం పూర్వ విద్యార్ధులను అవార్డులతో సన్మానించనున్నట్లు తెలిపారు. విద్యార్ధుల సాంకేతిక ఉత్పత్తుల ప్రదర్శన, క్రీడా సాంస్కృతిక ప్రదర్శనలు పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో భాగంగా నిర్వహిస్తామన్నారు. ఈ సైకిల్‌ ర్యాలీలో భాగంగా ఈ నెల 16వ తేదీ వరకు గీతం పూర్వ విద్యార్ధులను కలిసి వారిలో స్పూర్తి నింపాలన్నది తమ ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో గీతం ప్రస్తుత విద్యార్ధులు సూర్య సందీప్‌ పాల్గొన్నారు.

➡️