18వ డివిజన్‌లో ఏపీ వై నీడ్స్‌ జగన్‌

Dec 20,2023 21:26
మాట్లాడుతున్న కొండ్రెడ్డి రంగారెడ్డి

మాట్లాడుతున్న కొండ్రెడ్డి రంగారెడ్డి
18వ డివిజన్‌లో ఏపీ వై నీడ్స్‌ జగన్‌
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని 18వ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డివిజన్‌ హరినాధపురంలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు, రూరల్‌ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఆదేశాల మేరకు 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ టి.అశోక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. 18వ డివిజన్లోని హరినాధపురంలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజలకు అందించిన అనేక సంక్షేమ పథకాలను తెలిపే డీస్ప్లే బోర్డును డివిజన్‌ వైసిపి నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ప్రభుత్వం నవరత్నాల ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొకటిగా వివరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో పార్టీ జెండాను డివిజన్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆవిష్కరించారు. స్థానిక డివిజన్‌ నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను డోర్‌ టు డోర్‌ తిరుగుతూ ప్రజలకు సమగ్రంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రేడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గడిచిన 8 నెలల స్వల్ప కాలంలో 150 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం అభివద్ధి పథంలో నడిపిస్తున్న నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు, రూరల్‌ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌ రెడ్డికీ రూరల్‌ ప్రజలందరూ తమ సంపూర్ణ మద్దతు అందించి 2024 సంవత్సరంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిహెచ్‌ హరిబాబు యాదవ్‌, ఏసు నాయుడు, అశోక్‌ నాయుడు, ముడియాల రామిరెడ్డి, దారా వంశీ, వాలంటీర్లు, డివిజన్‌ వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

➡️