19 నుంచి మహిళా రాష్ట్ర కబడ్డీ పోటీలు

Dec 16,2023 20:41

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  ఈనెల 19,20,21 తేదీలలో రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో, ఇందుకు సంబంధించిన పోస్టర్లను వైసిపి ప్రాంతీయ వ్యవహారాల ఇన్చార్జి వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. స్థానిక మహిళా పార్కులో ఈ మేరకు పోటీల సన్నాహాలను చేపడుతున్నారు. మొదటి బహుమతిగా 50వేల, రెండవ బహుమతిగా 40 వేలు, మూడో బహుమతిగా 30 వేలు, నాలుగో బహుమతిగా 20 వేల రూపాయలు చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులను అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, నగర మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ లయా యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️