20కల్లా ఓటరు దరఖాస్తుల పరిష్కారం

ఓటరు దరఖాస్తుల

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంయువ ఓటర్లు, ఓటు హక్కు లేనివారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయడంలో వివిధ తేదీల్లో ప్రత్యేక ప్రచారాలు చేపట్టామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హేతుబద్ధీకరణతో కూడిన ఓటరు గుర్తింపు నమోదు జిల్లాలో నిర్వహిస్తున్న స్వీప్‌ కార్యకలాపాల ద్వారా రాజకీయ పార్టీల భాగస్వామ్యం ద్వారా పెద్ద ఎత్తున నమోదు చేసినట్టు చెప్పారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేలా రాజకీయ పార్టీలు తమ వంతు పాత్ర పోషించాల్సి ఉందన్నారు. జిల్లాలో ఓటరు నమోదు ప్రత్యేిక కార్యక్రమాలను డిసెంబర్‌ 9 వరకు నిర్వహించామన్నారు. జిల్లాలో స్వీప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మార్పులు చేర్పులు గుర్తింపు తొలగింపునకు విరివిగా దరఖాస్తులని స్వీకరించి, వాటిని పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో జనాభా నిష్పత్తి ఎలక్టోరల్‌ నిష్పత్తి, లింగ నిష్పత్తి, సేవా ఓటర్లు తదితర వివరాలు ఆధారంగా ఓటరు జాబితా పూర్తి హేతుబద్ధత కలిగి ఉండేలా చర్యలు తీసుకుంకటున్నట్టు చెప్పారు. జిల్లాలో స్వీప్‌ కార్యకలాపాలకు నోడల్‌ అధికారులను నియమించామని, వాటి పరిశీలన ఈ నెల 26 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. మార్పులు, చేర్పుల అనంతరం 5నన తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రతినిధులు బి.రామచంద్రరావు, ఎన్‌.రమేష్‌ శ్యామ్‌, ఎ.గోవింద్‌, ఎస్‌ఎస్‌.మూర్తి పాల్గొన్నారు.

➡️