27 నుంచి జగన్‌ బస్సుయాత్ర

ప్రజాశక్తి – కడప ప్రతినిధి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది. రెండు నెలల కిందటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు చేపట్టింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇటీవల ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వైసిపి అధ్యక్షులు జగన్‌ బస్సుయాత్రను వేగవంతం చేశారు. రాష్ట్రంలో సిద్ధం సభలు నిర్వహించని ప్రాంతాల మీదుగా బస్సుయాత్ర సాగించనుంది. ఈదిశగా వైసిపి నాయకత్వం రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసే పనిలో నిమగమైంది. ఈనెల 27వ తేదీన జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వేంపల్లి మీదుగా ప్రొద్దుటూరులో ‘మేమంతా సిద్ధం’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వ హించనుంది. స్థానిక వైసిపి నాయకత్వం భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పా ట్లను వేగవంతం చేసింది. ప్రొద్దు టూరు వైసిపి అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి ప్రతిపక్ష టిడిపి ధీటైన అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని నియ మించడంతో పోటాపోటీ వాతా వరణం నెలకొంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రొద్దు టూరులో భారీ బహిరంగసభ ప్రాధా న్యతను సంతరించుకుంది. సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది.

➡️