అప్రంటీస్‌ కు 33 మంది ఎంపిక

Jun 16,2024 14:59 #33, #apprentice, #people, #selected

ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలోని స్థానిక విటి అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ ఐటిఐలో శనివారం ఉదయం మేదో సర్వొ అప్రెంటిస్‌ షిప్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ లో 33 మంది ఎంపికయ్యారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్‌ టీ.వి.గిరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్‌ ఆఫీసర్‌ జి.రామాచారి, ఇతర సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే ఐ టి ఐ ట్రేడ్‌ లు పాసైనవారికి, 2024 విద్యా సంవత్సరం ట్రైనింగ్‌ పూర్తి చేసుకుంటున్న విద్యార్ధులను కూడా ఈ క్యాంపస్‌ డ్రైవ్‌ లో అప్రంటీస్‌ కు ఎంపిక చేశారు.

➡️