4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

Jan 7,2024 23:02
కేంద్ర ప్రభుత్వం

ప్రజాశక్తి – కాకినాడ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని ఎపిఎంఎస్‌ఆర్‌యు జనరల్‌ బాడీ సమావేశం డిమాండ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ (ఎపిఎంఎస్‌ఆర్‌యు) కాకినాడ నగర బ్రాంచ్‌ 50వ వార్షిక జనరల్‌ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. స్థానిక సుందరయ్య భవన్‌లో యూనియన్‌ నాయకుడు కె.అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ సి. వెంకట్రావు మాట్లా డుతూ ఎందరో పూర్వ నాయకులు చేసిన ఉద్యమా లతో అనేక హక్కులను రాబట్టుకున్నామని, ఆ హక్కు లను కాపాడుకునందుకు రాబోయే కాలంలోనూ ఉద్యమాలను కొనసాగించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్‌ కోడ్‌లు రద్దు చేసే వరకు ఇతర కార్మిక సంఘాలతో కలిసి తమ పోరాటాన్ని సాగించాలని పిలుపునిచ్చారు. సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేసేలా ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ తమ డిమాండ్ల గురించే కాకుండా ప్రజలందరి ఆరోగ్య రక్షణ కొరకు ఉద్యమాలు నిర్వహించడం అభినందనీ యమన్నారు. అనంతరం యూనియన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి ఎఆర్‌సి.వర్మ ప్రవేశ పెట్టిన కార్యదర్శి నివేది కను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం ప్రారంభానికి ముందుగా పలువురు అమరవీరులకు నివాళులర్పించారు. మందులు వైద్య పరికరాలపై జిఎస్‌టి. పూర్తిగా తొలగించాలని, ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాలకు బడ్జెట్‌లో నిధులు పెంచాలని, మెడికల్‌ రిప్స్‌ వ్యక్తిగత గోప్యతకు రక్షణ ఉండాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచాలని, అంగన్‌వాడీ, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలకు సంఘీభావం ప్రకటిస్తూ తీర్మానాలు చేశారు.నూతన కార్యవర్గం ఏకగ్రీవంఅనంతరం నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం జరిగింది. నూతన అధ్యక్షుడుగా ఎంఎ. స్వామి, కార్యదర్శిగా సత్య శ్రీనివాస్‌, కోశాధికారిగా రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా దీక్షిత్‌, వెంకటేష్‌, సహాయ కార్యదర్శులుగా వర్మ, శ్యామ్‌, కమిటీ సభ్యులుగా సుబ్ర హ్మణ్యం, అశోక్‌, కిశోర్‌, హుస్సేన్‌, సతీష్‌, షంషుద్దీన్‌, దుర్గా ప్రసాద్‌, ఆదినారాయణ, నరేష్‌, అప్పారావు, ప్రసాద్‌, అయ్యప్ప, శేఖర్‌ తదితరులు 24 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

➡️