అక్రమంగా తరలిస్తున్న 40 మద్యం బాటిళ్లు స్వాధీనం

ప్రజాశక్తి-హుకుంపేట(అల్లూరి) : అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న వ్యక్తిని హుకుంపేట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. హుకుంపేట మద్యం షాపు నుండి గత్తుం పంచాయతీ జి.బొడ్డాపుట్టు గ్రామానికి అక్రమంగా 40 మద్యం బాటిల్స్‌ తరలిస్తున్న శోభ రాంబాబు అదుపులో తీసుకొని స్టేషన్లు తరలించి మద్యం బాటిల్‌ సీజ్‌ చేసినట్లు సిఐ సన్యాసినాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. మద్యపానం నిషేధించి గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులు సహాయ పడాలన్నారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామ ప్రజలు సహకార అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ సతీష్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️