5న మహాధర్నాను జయప్రదం చేయండి

 బెల్లంకొండ: ఈ నెల 5 వ తేదీన మంగళగిరి సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా వీఆర్‌ఏల సంఘం అధ్యక్షులు షేక్‌ బందగీ సాహెబ్‌ కోరారు. మంగళవారం బెల్లంకొండ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఆర్‌ఏల దీర్ఘకాలికంగా ఉన్న పలు సమస్యల పరిష్కారం కోసం ఈ మహాధర్నాను తలపెట్టినట్లు చెప్పారు. ఇచ్చిన హామీని పరిష్కరిస్తామని చెప్పిన జగన్‌ అధికారంలోకి రాగానే మరిచిపోయారని విమర్శించారు. అనంతరం బెల్లంకొండ మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు.బెల్లంకొండ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ అధ్యక్షులుగా సుందర్‌ రావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసా సాహెబ్‌, కోశాధికారి లక్ష్మీ దుర్గ, మండల జాయింట్‌ సెక్రెటరీ పొన్నూరు ఆంజనేయులు ను మండల వీఆర్‌ఏలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన మండలం నూతన కమిటీ నాయకులను తహశీల్దార్‌కి పరిచయం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను తహశీల్దార్‌ దృష్టికి తీసుకెెళ్లగా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సత్తెనపల్లి డివిజన్‌ అధ్యక్షులు సంజీవరావు, సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పుల్లారావు ,బెల్లంకొండ మండల వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

➡️