60వ రోజుకు బార్‌ అసోసియేషన్‌ దీక్షలు

Mar 6,2024 22:01

మాట్లాడుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌
ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ :
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూహక్కు చట్టం రద్దు చేయాలని గుంటూరు బార్‌ అసోసియేషన్‌ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 60వ రోజుకు చేరింది. బుధవారం 60వ రోజు సందర్భంగా 60 మంది న్యాయవాదులు నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రజా, రైతు వ్యతిరేక భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని, తాతాలు తండ్రులు సంపాదించుకున్న ఆస్తులపై ప్రభుత్వాలు ఎలాంటి అజమాయిషీ చలాంచరాదని అన్నారు. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని, శాసన, కార్యనిర్వాహక వారు చేసే పనులను సమీక్ష చేయాల్సిన బాద్యత న్యాయవ్యవస్థది అన్నారు. అలాంటి న్యాయవ్యవస్థను ఈ చట్టంపై నియంత్రణ లేకుండా చేయటం సరికాదన్నారు. దీక్షాశిబిరానికి మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, నగర జనసేన అధ్యక్షులు నేరెళ్ల సురేష్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు.

➡️