7వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

మండపేటలో ఎస్‌ఎస్‌ఎ సమ్మెకు మద్దతు తెలుపుతున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-మండపేట

ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తలపెట్టిన సమ్మె మంగళవారానికి ఏడవ రోజుకుచేరింది. జిల్లా కార్యాలయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు యుటిఎఫ్‌ నాయకులు కె గోపాలకష్ణారెడ్డి, ఎమ్‌ శ్రీనివాస్‌ తదితరులు మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పిఆర్‌సి అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దారుణమన్నారు ఇప్పటికైనా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండపేటకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎస్‌ సర్వేశ్వరరావు, శేషారావు, జె. నారాయణరావు, ఆర్కే మాధురి తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️