8న ఆశాల చలో విజయవాడ

Feb 1,2024 21:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 8న చలో విజయవాడ వెళ్తున్నామని విజయనగరం అర్బన్‌ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి మహాలక్ష్మి, నాయకులు, రాజేశ్వరి, అప్పయ్యమ్మ , పద్మ తెలిపారు. గురువారం నగరంలోని కెఎల్‌పురం, లంకా పట్నం, ధర్మపురి అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ మెడికల్‌ ఆఫీసర్లకు ఈనెల 8న విధులకు హాజరుకాలేమని తెలియజేస్తూ వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్‌లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, 10 లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యం, ఖాళీల భర్తీ, రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంపు, స్టాఫ్‌ నర్స్‌ నియామకాల్లో ఆశాలకు వెయిటేజీ తదితర సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

➡️