8వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 27,2023 21:43

ప్రజాశకి-విజయనగరం టౌన్‌  :   సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 8వ రోజుకి చేరుకుంది. సమ్మెకు మద్దతు తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని లేకుంటే ప్రభుత్వానకి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. యంటియస్‌ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్‌ ఒకేసారి విడుదల చేయాలన్నారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ సిపిఎం అండగా ఉంటుంద న్నారు. ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి గురువులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️